సమాజంలో ప్రతి ఒక్కరు మానవత్వంతో మెదలాలి

విలువలతో హక్కులను కాపాడుకొని సేవ మార్గంలో నడవాలి
నేషనల్ ఆంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు
మేడ్చల్ ఆగష్టు 21 ();సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ ఆంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయం జిల్లా అధ్యక్షులు చెరుకు రమేష్ సమక్షంలో గత రెండు రోజుల క్రిందట కార్యాలయానికి వచ్చి మా సమస్యలను పరిష్కరించండి మాకు న్యాయం చేయండి అంటూ మా సంస్థను కోరడం జరిగింది అందుకు మేము మా సంస్థ టీం సభ్యులు ముత్తు గీతాంజలి, రౌతు అశోక్ , బుర్ర లక్ష్మణ్ గౌడ్ ,తొలిచుక్క కిరణ్, మరియు మీడియా మిత్రులతో కలిసి వెళ్లి సమస్యను పూర్తిగా పరిష్కరించి వారికి న్యాయం చేయడం జరిగింది. అందుకు ఈరోజు మాతో న్యాయం పొందిన వ్యక్తులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయానికి వచ్చి టీం సభ్యులందరినీ ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకు రమేష్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో రాజ్యాంగానికి అనుకూలంగా సమాజంలో ప్రతి ఒక్కరు మానవత్వంతో మెదలాలని సహాయం చేసే గుణం ఉండాలని విలువలతో హక్కులను కాపాడుకొని సేవ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం ఖాళీగా ఉండేవారు మానవ హక్కుల సంస్థల చేరాలని కోరనది

Leave A Reply

Your email address will not be published.

Breaking