తూప్రాన్ లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు.

 

మెదక్ తూప్రాన్ ఆగస్ట్.21( ప్రజా బలం) న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పచ్చని పంట పొలాల మధ్య వెలసిన స్థానిక నల్ల పోచమ్మ మందిరం రేణుక ఎల్లమ్మ నాగేంద్రుని పుట్టలో మహిమల కాంతులు వెదజల్లాయి. అనంతరం మహిళలు చిన్నారులు భక్తితో దండం పెట్టి ఆయురారోగ్యాలు ప్రసాదించుమని అమ్మవారిని వేడుకున్నారు . మహిళలు, చిన్నారులు కొత్త వస్త్రాలు ధరించి గ్రామ సమీపంలో గల పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తమ సోదరుల కళ్ళను పాలతో కడిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. గ్రామాల్లోని ఆలయాల్లో నాగుల పంచమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. స్థానిక నల్లపోచమ్మ ఆలయమైన పంట పొలాల మధ్య వెలిసిన రేణుక ఎల్లమ్మ నాగరాజు నాగదేవతల అమ్మవారి ఆలయం, మహంకాళి దేవాలయం శివాలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలివచ్చారు. మహిళలు చిన్నారులు పూజలు నిర్వహించి భక్తితో భజనతో అమ్మవారికి నమస్కరిస్తూ పూజించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking