ఇంకెన్నాళ్లు ఈ బానిస బతుకులు ఇకనైనా తెగించి పోరాడుదాం

తెలంగాణ కురుమ కులస్తులారా బిఆర్ఎస్ పార్టీని సీఎం కేసిఆర్ ను ప్రశ్నించండి

త్వరలో లక్షల మంది కురుమలతో ప్రగతి భవన్ ముట్టడిస్తాం

కురుమలకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ప్రకటించని మీకు మేము ఓటు ఎందుకు వేయాలి

మా జనాభా ఎంతో మాకు అన్ని టికెట్లు ఎందుకు ఇవ్వరు మీ వెలమ కులం బలం ఎంత

గొర్రెలు కాస్తూ కథలు చెబుతూ డోలు వాయించే మాకు పార్టీని ఓడించడం తెలుసు

…..బింగి స్వామి కురుమ,
కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు

సంగారెడ్డి ఆగస్టు 21 ప్రతినిధి:
9 సంవత్సరాలుగా మీరిచ్చిన హామీలు రాజకీయంగా అవకాశాలు నెరవేరుస్తారని ఆశించాం ఆశతో ఎదురు చూసాము కానీ మీ హామీలు నీట మూటలే అయ్యాయి.మీరు మాటలతో మాయ చేసి మమ్మల్ని వంచించారు.
రాష్ట్రంలో ప్రధాన సంఖ్య బలం జనాభా కలిగిన కురుమలకు టిఆర్ఎస్ పార్టీ నమ్మకద్రోహం చేసింది.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కురుమలకు 10సంవత్సరాలుగా కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీసిన కేసిఆర్ ఎన్నికల సమయానికి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ప్రకటించకుండా నట్టేట ముంచారు.
రాజ్యాధికారం కోసం మా వాటా మాకు దక్కాలంటూ అనేకమార్లు విన్నవించిన పెడచెవులు పెట్టిన బిఆర్ఎస్ పార్టీ మేం ఓటు ఎందుకు వేయాలి115 మంది అభ్యర్థులను ప్రకటించి అందులో కురుమ కులానికి ఒక్క టికెట్ ఇవ్వని కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలంటూ కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కీలకంగా పనిచేసిన కురుమలను రాజకీయంగా అనగదొక్కాలని కుట్రతో కేసీఆర్ ప్రతిసారి నమ్మకద్రోహం చేస్తూనే వస్తున్నారు. కురుమలు రాజకీయంగా ఎదిగితే న్యాయం ధర్మం వైపు ఉంటు అవినీతి పాలన సాగదు అందుకే కురుమలను రాజకీయంగా ఎదగకుండా కేసీఆర్ కుట్రపన్నారు.గొర్రెలు బర్రెలు నెపంతో అడవులకు కురుమలను పరిమితం చేస్తూ రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారు. తూతూ మంత్రంగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మేం కురుమలకు ఏదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కురుమలకు ఎమ్మెల్యేగా అవకాశం ఎందుకు కల్పించరని బిఆర్ఎస్ పార్టీని గట్టిగానే అడుగుదాం ఇతర పార్టీలో టికెట్లు ఇస్తే బిఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కురుమలు సిద్ధంగా ఉన్నారని విషయాన్ని అన్ని పార్టీలకు అర్థమయ్యే విధంగా చెబుదాం ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా బలంగా ఉన్న కురుమలు తెలంగాణలో ఎందుకు పలుచబడ్డారు అసెంబ్లీలో లేకుండా పోయారు పార్లమెంటుకు పనికిరాకుండా పోయారు అని అనేక విషయాలను మరొకమారు గుర్తు చేసుకుని 2024 ఎన్నికల్లో అత్యధికంగా కురుమలను అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా పని చేద్దాము దానికి కురుమ రిజర్వేషన్ పోరాట సమితి సిద్ధంగా ఉంది రాజకీయ పార్టీలకు కురుమలు అత్యధికంగా ఐక్యంగా ఉన్నారని కచ్చితంగా కురుమలకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుపు తధ్యమని నమ్మకం కలిగిద్దాం. ఐక్యమత్యంతో కురుమల ఐక్యత చాటుదాం.

Leave A Reply

Your email address will not be published.

Breaking