రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో మౌలికవసతుల కల్పన, సంబంధిత అంశాలపై ఈరోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డి.ఐ) లో జరిగిన సమావేశంలో సీఎం చర్చించారు.
ఈ సందర్భంగా హైకోర్టు జడ్జీలు జస్టిస్ శ్యామ్ కోషీ, జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శ్రీమతి తిరుమలాదేవి, లా సెక్రటరీ తిరుపతి, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Next Post