సనత్ నగర్ నియోజకవర్గ భారాస పార్టీ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖరారు కావడంతో మంగళవారం ఆయన ఇంటివద్ద కోలాహలం నెలకొంది.
మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు,అభిమానులు తరలవచ్చారు.
సనత్ నగర్ నియోజకవర్గం నుండే కాకుండా నగరం నలుమూలల నుండి పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ కాలనీల అసోసియేషన్ ల ప్రతినిధులు వచ్చారు.
డప్పు చప్పుళ్ళు, బాణసంచా కాల్చి, నృత్యాలు చేస్తూ సంబురాలు చేశారు.