తూప్రాన్ మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారుల జాప్యం వల్ల కుల ఆదాయ నివాస జనన మరణ ధృవీకరణ పత్రాల లబ్ధిదారుల ఇక్కట్లు .
మెదక్ తూప్రాన్ జనవరి 11 ప్రాజబలం న్యూస్:-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుల ఆదాయ నివాస జనన మరణ ధృవీకరణ పత్రాలను మీసేవ కేంద్రాల ద్వారా నెలల తరబడి క్రితం ఆర్జీ చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటికీ ధృవీకరణ పత్రాలు మంజూరు కాకపోవడంతో తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీని వల్ల ప్రభుత్వ పథకాలు నష్టపోతున్నామని
లబ్దిదారులు ఆందోళనచెందుతున్నారు.
ఓయూ స్టూడెంట్ సామాజిక విశ్లేషకులు భీమరి సాయి సమీర్ మాట్లాడుతూ
రెవిన్యూ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నారు.