తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అన్నదానం.

కౌన్సిలర్ కోడిప్యాక నారాయణ గుప్తా.
ఘనంగా శాలువాతో సత్కరించి అభినందించిన
ప్రజా ప్రతినిధులు.

మెదక్ తూప్రాన్ జనవరి 11 ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కౌన్సిలర్ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు కొడిప్యాక నారాయణ గుప్తా వీరి తల్లిదండ్రులు కొడిప్యాక రాజమణి లక్ష్మి కాంతం తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా అమావాస్య అన్నదాన ప్రసదం నిర్వహించారు. ఈ మహాఆన్నదానం కార్యక్రమంలో మున్సిపల్ ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు తల్లిదండ్రుల పేరిట అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందినీయమని ప్రశంసిస్తూ కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తను ఘనంగా శాలువాతో సత్కరించారు. కౌన్సిలర్ కోడిపాక నారాయణగుప్త ఆధ్వర్యంలో 2014 నూతన సంవత్సర ఐ వి ఎఫ్. క్యాలెండర్, ఆర్యవైశ్య సంఘం నాయకుల క్యాలెండర్ ను ఆర్యవైశ్య సంఘం సభ్యులు గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. పలువురు ఆర్యవైశ్య సంఘ సభ్యులు నారాయణ గుప్తను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు బాలరాజ్ గుప్తా, ప్రభాకర్ గుప్తా, నాగేష్ గుప్తా, లక్ష్మణరావు గుప్తా, శ్రీనివాస్ గుప్తా, ఉప్పల నరసింహులు, అశోక్ గుప్తా, నాగరాజు, దేవతా అశోక్, శ్రవాణ్ , సాగర్,ప్రవీణ్, నారాయణ, వార్త కుమార్, రమేష్, ప్రవీణ్, నవీన్ , ఆంజనేయులు, రవీందర్, సాయి,ప్రజా ప్రతినిధులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking