లేదంటే పోరాటాన్ని ఉదృతం చేస్తాం
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి,
సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి
కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి జూలై 5
బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని,సింగరేణి సంస్థకే కేటాయించాలని లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈరోజు స్థానిక కలెక్టరేట్ ముందు వామపక్షా పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమైన బొగ్గు బ్లాక్ లను వేలం వేయడం అంటే తెలంగాణ తల ను నరికివేసి మొండాన్ని మిగిల్చడమేనని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ రామగుండం పర్యటన చేసిన సందర్భంగా సింగరేణిని వేలం వేయమని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ సంపదను కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సంపదను దోచుకోవడానికే తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల కేంద్రమంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం లోఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వినతి పత్రాలకు పరిమితం కాకుండా బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, అఖిలపక్ష పార్టీలను ఆహ్వానించి పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , కిషన్ రెడ్డి వేలంపాటలో స్వయంగా పాల్గొనడం వెనక ఆంతర్యం ఏంటనీ ప్రశ్నించారు.తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదాని, నాడువీర తెలంగాణ సాయుధ పోరాటం, నిన్న ప్రత్యేక తెలంగాణ పోరాటం చేసి అధికారుల మెడలు వంచిన ఘన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉందని గుర్తు చేశారు. మంద బలం ఉంది కదా అని పార్లమెంటులో చట్టాలు చేస్తే ప్రజలు ఆహ్వానించరని, ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంతో నరేంద్రమోడీ మెడలు వంచి నల్లచట్టాలను రద్దు చేసుకున్న ఘటన చూశామని అన్నారు. రైతు ఉద్యమ స్ఫూర్తితో బొగ్గు బ్లాక్ ల వేలాన్ని రద్దు చేసేంతవరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అత్యధికంగా లాభాలతో నడుస్తున్న బిఎస్ఎన్ఎల్ ను తొక్కి పెట్టి, జియో రూపంలో అనిల్ అంబానీ జేబులు నింపారని అదే విధంగా సింగరేణి ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే విధంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని అన్నారు. బొగ్గు గనులను వేలం వేస్తే వేలాదిమంది సింగరేణి కార్మికుల ఆగం అవుతాయని, తెలంగాణ ఆర్థిక సంపదను అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకొని తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నరేంద్ర మోడీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్ లో బొగ్గు బ్లాక్ ల రద్దు చేయాలని పోరాడాలని లేదంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.వామపక్ష పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్ లను, ఇతర పార్టీలను కలుపుకొని లోపల పార్లమెంటులో, బయట ప్రత్యక్ష ఆందోళన, పోరాటాలను ఉదృతం చేస్తామని ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు మరింత ఉధృతంగా పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు మంద పవన్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుంద రెడ్డి,గుడికందుల సత్యం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జిందం ప్రసాద్, తెలుగుదేశం నగర అధ్యక్షులు కళ్యాడపు ఆగయ్య, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొన్నగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయని అశోక్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, డి నరేష్ పటేల్, వామపక్ష పార్టీల నాయకులు టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, పున్నం రవి, వడ్ల రాజు, రాయి కంటి శ్రీనివాస్, గాజుల కనకరాజు, గూడెం లక్ష్మి బత్తుల బాబు, బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, గజ్జల శ్రీకాంత్, కాంపెల్లి అరవింద్, నలువాల సదానందం,రోహిత్, కిష్టాపురం లక్ష్మణ్, సాయివేణి రాజమల్లు,నరసింహ రాజు, తెలుగుదేశం నాయకులు పెందవేన రాజేశం,ఇట్ట మల్లేశం తదితరులు పాల్గొన్నారు.