అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం సురేష్.

సంగారెడ్డి జులై 5 ప్రజ బలం ప్రతినిది:
విద్య రంగా సమస్యలు పరిష్కారం చాలని చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్ వెళ్తుండగా సంగారెడ్డి చౌరస్తా లో రూరల్ పిఎస్ వాళ్ళు అక్రమంగా అరెస్టు చేసి రూరల్ పిఎస్ కు తరలించడం దుర్మార్గం, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా సంవత్సరాలు గడిచిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని చలో సెక్రటేరియట్ పిలుపును ఇస్తే ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి అణగారిన వర్గాల విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కార్ తెచ్చిన “నూతన జాతీయ విద్యా విధానం – 2020 తీసుకొచ్చి శ్రామిక వర్గాల పిల్లలకు, పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేదిగా ఉందని,విద్యారంగంలో సైంటిఫిక్ టెంపర్ పెంచే విద్యా విధానాన్ని కొనసాగించకుండా, మూఢ విశ్వాసాలను పుక్కిటి పురాణాలను, కాలం చెల్లిన సాంప్రదాయాలను, మనవాద సిద్ధాంతాలను సిలబస్ లో ప్రవేశపెడుతున్నారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభంను ఎదుర్కొంటుందని,గత పదేళ్ళ కాలంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రధానంగా విద్యారంగాన్ని కోలుకోలేని విధంగా ధ్వంసం చేసిందని,యూనివర్సిటీలను పూర్తిస్థాయిలో నిర్లక్ష్యానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసమైన విద్యారంగాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడంతో పాటు మొత్తం విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన అవసరముందని అని ఉన్నారు ఈ కార్యక్రమంలో అక్రమంగా అరెస్టు అయినవాళ్లు పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు సందీప్. జిల్లా నాయకులు అర్జున్. సిద్ధార్థ్ . బన్నీ . అఖిల్ నిఖిల్ .తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking