ఓటింగ్ శాతం పెంచడంలో కృషిచేసిన మీడియా ప్రతినిధులకు అవార్డులు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్‌ 07 : 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని పెంపొందించడంలో మీడియా నిర్వహించిన పాత్ర గుర్తించి అవార్డులు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.2004 సంవత్సరం ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషించిన ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ టెలివిజన్ మీడియా, ఎలక్ట్రానిక్ రేడియో మీడియా,ఆన్లైన్ (ఇంటర్నెట్) సోషల్ మీడియా ప్రతినిధుల కు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవార్డు ప్రధాన ఉత్సవం జరుగుతుందని తెలిపారు.జిల్లా పరిధిలోని సంస్థలు, ప్రతినిధులు తాము చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, శిబిరాల పూర్తి వివరాలతో నామినేషన్లు సమర్పించాలని, ఈనెల 25వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking