అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ చిలకల వెంకట నరసయ్య చిత్తారు సింహాద్రి యాదవ్
ఖమ్మం ప్రతినిధి నవంబర్ 7 (ప్రజాబలం) ఖమ్మం
ఈనెల ఆరవ తారీకు నుండితెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా బీసీలుయొక్క స్థితిగతులు జనాభా వివరాలు పూర్తిగా తెలియడం ద్వారా రాజ్యాంగం నుండి సంక్రమించే హక్కులు అధిక జనాభా గలిగిన బీసీలకు వచ్చే అవకాశం ఉందని, కావున అధికారులకు సహకరించవలసిందిగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు అఖిలభారత యాదవ మహాసభ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 2014 ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే ద్వారా బీసీల శాతం 61% ఉన్నదని తేలింది. కానీ దాన్ని గత ప్రభుత్వం ఆ సర్వే ని బయటపెట్టకుండా బీసీలకు రావాల్సిన హక్కులను రాకుండా అణగదొక్కడం జరిగిందని,బీసీల జనాభా ఎక్కువ ఉన్నదని తెలిస్తే హక్కుల కోసం పోరాటం చేస్తారని, వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయడం జరిగింది అని, ఆ విధంగా కాకుండా ఈసారి చేపట్టి కార్యక్రమం నిష్పక్షపాతంగా, ఉండాలని, సర్వే వివరాలను వెంటనే అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్వే ఆధారంగా బీసీలకు రాజ్యాంగ అధికారం కలిగించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా యాదవులు సర్వే ఫారం కులం(7)లో యాదవ్ అని వ్రాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్ ఎస్ టి ( సంచార జాతులు) సర్టిఫికెట్ను యాదవులకు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు పొదిల సతీష్ సత్తి వెంకన్న యాదవ్ వాగదాని కోటేశ్వరరావు పొదిలి భూపతి కంకు వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు