-మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 7 :
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాలతో మంచిర్యాల డిసిపి పర్యవేక్షణలో గురువారం మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ని ఎర్రగుంటపల్లి లో తెల్లవారుజామున మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్సైలు మరియు సిబ్బంది తో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి గ్రామంలో తనిఖీలు నిర్వహించి తగిన ద్రువ పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలను 1 ఆటో సీజ్ చేయటం జరిగింది.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , కాలనీ లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు ఉండే అనుమానాస్పద ప్రదేశాలలో నార్కోటిక్ డాగ్ తో పరిశీలించారు.కాలనీ లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు.
డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. కాలనీ లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఎవరైనా నిషేధిత గంజాయిని విక్రయించిన లేదా రవాణా చేసిన మాకు సమాచారము ఇవ్వాలని , అట్టివారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్ఐ రాజశేఖర్, కాశీపేట ఎస్సై ప్రవీణ్, దేవపుర్ ఎస్సై ఆంజనేయులు, ఆర్ఎస్ఐ శివ మందమర్రి అదనపు ఎస్సై శ్రీనివాస్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.