పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచండి

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

ప్రజా బలం ప్రతినిధి హనుమకొండ జిల్లా నవంబర్ 7:పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచే విధంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం శాయంపేట పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. ఈ రోజు ఉదయం శాయంపేట పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు మొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసుల గౌరవ వందనం చేశారు. ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పోలీస్ శాఖ మంజూరుచేసిన కిట్ ఆర్టికల్స్ ను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగి కేసులు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు కోర్ట్ లో పెండింగ్ లో వున్న కేసులు, వాటికి సంబందించిన దర్యాప్తు వివరాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ సబ్ ఇన్స్ స్పెక్టరు ను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న పలురకాల రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీంచారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలి. ఫిర్యాదు వచ్చి వెంటనే స్పందించాలని, ప్రజలకు పోలీసులపై వున్న నమ్మకానికి తగ్గాటుగానే పోలీసులు. నీజాయితీ తో పనిచేయాలని,పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట లకు భంగం కలిగించే విధంగా వ్యవహారిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తెలిపారు.చివరగా పోలీస్ కమిషనర్ చేతులమీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో పండ్ల మొక్కను నాటారు.ఈ తనిఖీల్లో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్,పరకాల ఏసీపీ కిశోర్, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ రంజిత్ రావు, ఎస్సై. ప్రమోద్ కుమార్ తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking