జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 7
ఈ నెల 5 తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం కరీంనగరు లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ సెలక్షన్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచి జడ్పీహెచ్ఎస్ కోరపల్లి ఉన్నత పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు వైష్ణవి,లౌక్యశ్రీ లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పిడి జి.శ్రీను తెలిపారు. వీరు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిరుదొడ్డి సమ్మయ్య అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బండారి రజిత, పోల్సని సంపత్ రావు,పి ఎం కె సంస్థ ప్రభాకర్ రావు,వి వి ఎస్ నారాయణ, వెంకటేశ్వర్ల రెడ్డి గ్రామస్తులు మరియు ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు పలువురు అభినందించారు