దళితుల పట్ల వివక్షత చూపిస్తున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు

ధర్మ సమాజ్ పార్టీ నాయకులు చిలువేరు శ్రీకాంత్

జమ్మికుంట ప్రజబలం ప్రతినిది నవంబర్ 7

దళిత బంధు రెండో విడత నిధుల జాప్యంపై టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి పై గురువారం రోజున జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ, నాయకులు తీవ్రంగా మండిపడ్డారు,గత బిఆర్ఎస్ ప్రభుత్వం హుజరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమం హుజురాబాద్ నియోజకవర్గం లో దళితులకు రెండో విడత ఇవ్వకుండా మధ్యలోనే అసంపూర్తిగా ఉంచడంపై ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి & ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి చిలువేరు.శ్రీకాంత్ మహారాజ్, మాట్లాడుతూ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత నిధుల జాప్యం పై బిఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో బి ఆర్ ఎస్ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం దళిత బంధు రెండో విడత నిధులను ఆపింది పాడి కౌశిక్ రెడ్డి పనే అని విమర్శించారు. మళ్ళీ తనే హుజురాబాద్ నియోజకవర్గం లో ఉన్న దళిత కుటుంబాలకు అండగా ఉంటానని, దళితుల కోసం తలనైన నరుకుంటా అని మాట్లాడడం సిగ్గుచేటని, నిజంగా నీకు దళితులపై చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేసి 50 వేల దళిత ఓట్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మీ పార్టీ నుండి దళితున్ని ఎమ్మెల్యే చేసే దమ్ముందా, అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ మీ పార్టీ అధికారంలో ఉంది కదా మరి మీరు క్లోజ్ చేసినా అకౌంట్లోను ఓపెన్ చేసి నేరుగా మీరే చెక్కు రూపంలో ప్రతి ఒక్కరికీ ఇవ్వచ్చు కదా, కానీ మీరు ఆ పని ఎందుకు చేయడం లేదు అంటే మీరు కూడా దళితుల పట్ల వివక్షతనే చూపిస్తున్నారని అన్నారు,
దళిత బంధు రెండో విడత నిధులు వారంలోగా మంజూరు చేయని యెడల ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హుజరాబాద్ నియోజకవర్గం లో రిలే నిరాహార దీక్షల తో పాటు ఆమరణ నిరహార దీక్ష చేయడానికైనా సిద్ధమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాకేష్,సదానందం మండల నాయకులు రవితేజ, సందీప్,ప్రేమ్ సాగర్,అభిలాష్, శివాజీ,ప్రశాంత్,రక్షిత్,కుమార్, రాకేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking