ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 28 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో ని పి.ఏ.సి.ఎస్. జెండా వెంకటాపూర్ రైతు వేదిక లో రైతులందరికి రైతు బంధు పథకంలోని పెద్ద రైతుల కవరేజ్ సాగులో లేని భూములకు సహాయం అందించడం వంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి వాటాదారులందరితో విస్తృత సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అందువల్ల,ప్రస్తుత రైతు బంధు పథకంపై చర్చించడానికి,పాక్స్ సభ్యుల రైతుల ఇన్‌పుట్‌లను సేకరించేందుకు పి.ఏ.సి.ఎస్. స్థాయిలో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
అందువలన తేది 29.06.2024 శనివారం రోజున మధ్యాహ్నం 1.00 గంటకు ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం జెండా వెంకటాపూర్ తరపున అందరికి జెండా వెంకటాపూర్ రైతు వేదిక వద్ద రైతుబందు స్కీమ్ గురించి అవగాహన సదస్సు ఉంటుంది.రైతులందరూ సకాలములో హాజరు కాగలరని జెండా వెంకటాపూర్ సి.ఇ.ఓ, కార్యదర్శి విష్ణు వర్ధన్ రావు తెలిపారు.