జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 28
జమ్మికుంటలో జర్నలిస్టు కానీ అనర్హులకు తన అనుచరులకు జర్నలిస్టుల పేరుతో ఇండ్ల స్థలాలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేటాయించారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికెళ్ల భానుచందర్ అన్నారు. శుక్రవారం రోజున టిడబ్ల్యూజెఎఫ్ జమ్మికుంట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నియోజవర్గ కమిటీ సమావేశం నియోజకవర్గ కమిటీఅధ్యక్షులు సౌడమల్ల.యోహాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికెళ్ల భానుచందర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్లు,ఇళ్ల స్థలాలు,హెల్త్ కార్డులు,రైల్వే పాసులు పునఃప్రారంభం సౌకర్యం వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. స్థానికంగా హుజురాబాద్ నియోజకవర్గం లో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎమ్మెల్యే ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మోసం చేశారని దీనిపైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ విచారణ చేపట్టి అర్హులైన వారికి ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు. సౌడమల్ల యోహాన్ ప్రధాన కార్యదర్శి అయిత రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు ఏబూషి సంపత్, సహాయ కార్యదర్శి ఖాజా ఖాన్, రచ్చ రవికృష్ణ,శ్రీకాంత్,సంతోష్, దొడ్డే రాజేంద్రప్రసాద్, పాల్గొన్నారు.