- ఢల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రంలోని చెవెల్లా నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ రాజకీయ నాయకుడు కాళే యాదయ్య 1962, మే 16న మల్లయ్య – లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలోని, నవాబ్‌పేట్ మండలంలోని చించల్‌పేట్ గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన యాదయ్య మార్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి 1986లో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.
యాదయ్యకు జయమ్మతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
యాదయ్య కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎంపీపీ, జెడ్పీటీసీ పని చేసి, 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో కాంగ్రెస్ పార్టీ నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నం చేతిలో ఓడిపోయాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 781 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత టిఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 33,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
ఆయన 2023 ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచాడు.
2024 జూన్ 28న తన రాజకీయ ప్రయాణంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పార్టీ అయిన భారతీయ రాష్ట్రీయ సమితి (దీRూ) నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మార్పు తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రధాన మలుపుగా నిలిచింది.
విద్య, ఆరోగ్యం, రోడ్ల నిర్మాణం వంటి పలు అంశాలలో ఆయన ఎంతో కృషి చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేసి, ప్రజల మన్ననలు పొందారు. కాళే యాదయ్య పై ప్రజలకు గల నమ్మకం, ఆయన చేసిన పనుల వలన మరింతగా పెరిగింది. ప్రజలు ఆయనకు సంఫీుభావం తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో కూడా అదే విధంగా ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఆయన రాజకీయ భవిష్యత్తు కొత్త దిశగా సాగనుంది. కాళే యాదయ్య గారి కొత్త రాజకీయ ప్రయాణం ప్రజల ఆకాంక్షలను అందుకుంటుందని ఆశిస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇస్తారు.