జమ్మికుంట, ప్రజాబలం ప్రతినిధి, జూన్ 27 :
యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బివి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కే శివసేన రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంటు ముట్టడిలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్ , హుజురాబాద్ నియోజకవర్గం కార్యనిర్వాహక అధ్యక్షుడు మమ్మద్ సజ్జాద్ కలిసి ఢిల్లీకి వెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు సజ్జు గురువారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపినట్టు చెప్పారు. ‘నీట్’ లీకేజీతో 24 లక్షల పైగా విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలిపారు. ఈ విషయమై యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.