నకిలి విత్తనాలు పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యవసాయ అధికారి చల్ల ప్రభాకర్
రైతులకు అవగాహన కార్యక్రమం,నకిలీ విత్తనాల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి చల్ల ప్రభాకర్ రెడ్డి రైతులకు సూచించారు.శనివారం బలరావుపేట్,మిట్టపల్లి, ఉత్కూర్,మోదెల,హన్మంతుపల్లి గ్రామాలలో రైతులకు నకిలీ విత్తనాలు,విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…లూజుగా ఉన్న సంచులలో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయ రాదన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుండి రసీదును తప్పని సరిగా తీసుకోవాలన్నారు.విత్తన పాకెట్, బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలన్నారు.వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్స్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు.విత్తన పాకెట్ మీద తయారయిన తేది,కాలం ముగిసే తేది చూసుకోవాలన్నారు.గ్రామాలలో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మిన వారి వివరాలు మండల వ్యవసాయ అధికారికి తెలియ జేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న,ఇర్ఫాన యష్మీన్, శ్రీనివాస్, అనుష, రైతులు పాల్గొన్నారు.