రాజన్న సిరిసిల్ల జిల్లా,
25 మే 2 2024 ,
ప్రజాబలం ప్రతినిధి,
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఏ. ఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్.
హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడి ఆ కుటుంబం పాలిట దేవుడయ్యిండు.
*సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
24/05/2024, రోజు సాయంత్రం హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన ఓ మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న గడ్డమిది శ్రీనివాస్.
తండ్రి శంకర్ మరణ వార్త విని గుండె పోటుకు గురై కుప్పకూలిన సిరిసిల్ల పట్టణానికి చెందిన గాంధీ నగర్ కు చెందినా చిలగాని అనూహ్య అనే మహిళా.
ఇంట్లో నుండి కేకలు వినబడడంతో వెంటనే స్పందించి ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి ఆమెకు సీపీఆర్ చేసిన అక్కడే రోడ్డుపై ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్.
ఆక్కడ ఏం జరిగిందో ఇంట్లో వాళ్లు గమనించేలోపే, అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించారు..ఆమెకు గుండెపోటు వచ్చినట్టు గుర్తించి వెంటనే సీపీఆర్ చేశారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తన సొంత వాహనంలో తరలించారు.
కానిస్టేబుల్ చాకచక్యంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు..ప్రస్తుతం ఆమెకు తారక రామారావు హాస్పటల్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నరు.
సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఈ సందర్బంగా అభినందించిన పలువురు నెటిజన్లు.
హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టిందనే చెప్పాలి. స్థానికులు కానిస్టేబుల్ ని అభినందించారు