మెదక్ 25 మే ప్రజాబలం న్యూస్ :- మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ లో ఇప్పటివరకు 3.82 లక్షల క్వింటాల్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగిందని,ఇంకా 35 వేల క్వింటాల్ల ధాన్యం మాత్రం ఇప్పుడు కొనుగోలుకు మిగిలి ఉన్నాయని తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి పేర్కొన్నారు . ముఖ్యంగా వెల్దుర్తి మండలం లో ఇంకా ధాన్యం కొనుగోల్లు పూర్తి కాలేదన్నారు. డివిజన్ లో 84 కొనుగోలు కేంద్రాలకు గానూ 53 కేంద్రాల్లో కొనుగోలు పూర్తి చేసి మూత పడ్డట్లు చెప్పారు. ఇంకా 31 కేంద్రాల్లో కొనుగోలు జరుగుతున్నాయని తెలిపారు. అంచనా ప్రకారం తూప్రాన్ డివిజన్ లో 92% నార్సింగి మండలం లో వంద శాతం కొనుగోలు మూడు రోజుల క్రితమే జరిగి, అన్ని కేంద్రాలను మూసి వేశారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మరియు రైస్ మిల్లు లలో ఈ సారి టాబ్ లలో కొన్న వివరాల్ని వెంట వెంటనే నమోదు చేయించటం వలన, రైతులకు వీలైనంత తొందరగా డబ్బులు అకౌంట్లల్లో పడుతున్నాయని తెలియజేశారు. తూప్రాన్ డివిజన్ లో కొనుగోలు వేగవంతంగా జరగటానికి సహకరిస్తున్న రైతులు, హమాలీలు,సెంటర్ల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, రెవెన్యూ ఉద్యోగులను ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఆర్డిఓ వెంబడి తూప్రాన్ మండల తహసిల్దార్
,విజయలక్ష్మి , రెవిన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.