👉 పని ప్రదేశంలో మహిళా సిబ్బందితో మర్యాదగా నడుచుకోవాలి.
👉 ఇతరుల పట్ల గౌరవం అనేది మొదటగా మన నుండి ప్రారంభంకావాలి.
👉 3-నెలల వృత్తి నైపుణ్యత శిక్షణను పూర్తి చేసుకున్న కొత్త కానిస్టేబుల్స్ కు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియయస్.
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 22(ప్రజాబలం)సంగారెడ్డి/శనివారం నాడు గీతం ఇంజినీరింగ్ కాళాశాల, రుద్రారం నందు ఏర్పాటు చేసిన పైనాన్షియల్ మేనేజ్మెంట్, వర్క్ ప్లేస్ నందు మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపుల గురించి సిబ్బందికి ఒక రోజు అవగాహన కార్యక్రమాని నిర్వహించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపిుయస్, ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ,వర్క్ ప్లేస్ నందు మహిళా సిబ్బందితో మర్యాదగా నడుచుకోవాలని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అన్నారు. నూతన చట్టాల ప్రకారం మహిళల పై జరుగుతున్న నేరాలకు కఠిన శిక్షలు ఉన్నాయని గుర్తుచేశారు. అదే విధంగా పోలీసు స్టేషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా మాట్లాడాలని పోలీసు శాఖకు మంచి పేరు రావాలంటే గ్రౌండ్ లెవెల్ లో ప్రజలకు దగ్గరగా ఉండే సిబ్బంది ప్రవర్తన మీదనే ఆదారపడి ఉంటుందని ఎస్పీఅన్నారు,పైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ,మొదటి నుండే పైనాన్షియల్ మేనేజ్మెంట్ నందు ఒక క్రమ బద్దమైన ప్లాన్ ను కలిగి ఉండాలని, ఏది అవసరం, ఏది అత్యవసరం అనేది గుర్తెరిగి డబ్బులు ఖర్చు చేయాలని అన్నారు. అనవసరంగా అత్యాశకు పోయి డబ్బులు రెట్టింపు అవుతాయని, ఇతర సామాజిక మాద్యామలలో వచ్చే అసత్యపు మాటలను నమ్మి మోసపోరాదని అన్నారు. అనవసర లోన్ యాప్ ల జోలికి వెళ్లరాదని, మన అవసారాన్ని బట్టి ముందుకు వెళ్లాలని అన్నారు,అనంతరం పైనాన్షియల్ మేనేజ్మెంట్ సలహాదారు రూప్ కుమార్ (సి.ఎ) మాట్లాడుతూ.. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయడం వలన లాభాలు పొందవచ్చు అని, ఇన్ కం టాక్స్ రిటర్న్ ఏవిధంగా ఫైల్ చేయాలి, అనే మెలకువలతోపాటు సిబ్బంది అడిగిన సందేహాలకు వివరణతో కూడిన సమాధనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్,అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, డియస్పిలు రవీందర్ రెడ్డి, సత్యయ్య గౌడ్, రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జిల్లా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు ఎస్బీ ఇన్స్పెక్టర్స్ విజయ్ కృష్ణ, డీసీర్బి ఇన్స్పెక్టర్స్ రమేశ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
