-చెన్నూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎం. డి నయూమ్
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్
పిబ్రవరి 22:
ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజాంబాద్ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని పట్టభద్రులు అధిక మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి నయం కోరారు. మందమర్రి లో ఐఎన్టియూసి ఆఫీసులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టుబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా అభ్యర్థి అయినటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం జరిగినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి బంధం ఉమేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రావుల అనిల్ లు మాట్లాడుతూ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ నోముల రాజేంద్ర గౌడ్, రేవెల్లి శ్రీకాంత్, మండలం అధ్యక్షులు శనిగారపు సాగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, చోటు మియా తిరుపతి రాజ్ కుమార్ వంశీ తదితరులు పాల్గొన్నారు.