ఆయా వార్డుల మహిళలు తెలుగుదేశంలో చేరిక

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 22

మందమరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 24 వార్డుల నుండి తెలుగుదేశం పార్టీ లో చేరారు. వీరికి పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్ జయ, పట్టణ ప్రధాన కార్యదర్శి. జూపాక సంధ్య మహిళల మేడలో కండువాలు కప్పి ఆహ్వానించినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ గడిచిన కాలంలో కాంగ్రెస్ భి ఆర్ఎస్ పార్టీలు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీలే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు నారా చంద్రబాబు హైటెక్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ గా తయారుచేసి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పాల్గొంటుందని ప్రజల పక్షాన పోరాడుతుందని సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే చేయడమే మా లక్ష్యం అని మహిళలందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, భాగ్యలక్ష్మి, సామ కవిత, స్వామి. సత్యనారాయణ. సరోజ, కళావతి, అరుణ రాజేశ్వరి, మంజుల అపర్ణ రజిత వరలక్ష్మి, రాణి, కళావతి, రమా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking