ఉప్పల్ ప్రజాబలం ప్రతినిధి:ఛత్రపతి శివాజీ శంబాజీ మహారాజ్ లు హైందవ సామ్రాజ్యం కోసం, మాతృదేశం కోసం వీరోచితంగా పోరాడి దేశానికి, ధర్మానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు అలాంటి మహనీయుల జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆర్కే యువభారత్ ఫౌండేషన్ చైర్మన్ కన్నెబోయిన రాము యాదవ్ తెలిపారు. పీర్జాదిగూడ నుండి సుమారు 250 మంది తో రాము యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరి ఉప్పల్ లోనీ ఏషియన్ తియేటర్లో చావా మూవీ ని తిలకించారు.ఈ సందర్భంగా రాము యాదవ్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ,శంబాజి మహారాజ్ లాంటి మహనీయుల చరిత్రను నేటి యువతరం తెలుసుకొని వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన వారు కొన్నేళ్లుగా కుట్రపూరితంగా వక్రీకరణకు గురై దేశ ధర్మ ద్రోహుల చరిత్రలను తెలుసుకుంటున్నారు.కాబట్టి ఇప్పటికైనా యువతరం మేల్కొని చత్రపతి శివాజీ శంబాజి మహారాజుల చరిత్రలను పూర్తిగా తెలుసుకొని వారు చూపించిన పోరాటాలను, ధర్మనిష్టలను కలిగి దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది అన్నారు. చావా లాంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని కోరుకుంటూ నిజాన్ని నిర్భయంగా తెలిపిన చావా సినిమా డైరెక్టర్, హీరో, హీరోయిన్లకు, నటీనటునులకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీత, నిర్వాహకులు శ్రీనివాస్ స్వామి, మహేష్, వివిధ కాలనీలో ప్రజలు, బిజెపి రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, బండారు పవన్ రెడ్డి, పిఎంసి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.