విద్యా వ్యాపారులను ఓడించండి

👉ఉపాధ్యాయ ఉద్యమ నేత వై. అశోక్ కుమార్ ను కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించండి
👉 టీఎస్ యుటిఎఫ్ సంగారెడ్డి జిల్లా

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 22(ప్రజాబలం)సంగారెడ్డి/శనివారం నాడు టీఎస్ యుటిఎఫ్ సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై. జ్ఞాన మంజరి మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయ మిత్రులందరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలోకి పోటీలోకి వచ్చిన రియల్ ఎస్టేట్ మరియు విద్య వ్యాపారులను ఓడించి ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడైన వై. అశోక్ కుమార్ ని గెలిపించాలని కోరారు.సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు మాట్లాడుతూ పెద్దల సభలో ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలు మన గొంతుకై వినిపించాలంటే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలంటే సుదీర్ఘ కాలం పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యమ నాయకుడిగా ఉన్న వై. అశోక్ కుమార్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీదనే ఉన్నదని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి ప్రభుత్వాలు తీసుకొస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నించి ఎండబెట్టడానికి పెద్దల సభకి ఉద్యమ నాయకున్ని పంపించడం అవసరమని అందరు గుర్తించాలని, అదే సందర్భంలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న వారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీలోకి వచ్చారంటే ఏమి ఆశించారో అర్థం చేసుకోవాలని, అలాంటి వ్యాపారులను గెలిపిస్తే వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప విద్యారంగం బాగు కోసం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆలోచన చేయరు, మాట్లాడరని గత రెండు.సంవత్సరాల కిందట హైదరాబాదు నుండి ఎన్నికైన ఎమ్మెల్సీ విధానం మనకు కొట్టొచ్చినట్టు చూపిస్తున్నదని వివరించారు. ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గంలో మనం విజ్ఞత ప్రదర్శించి అలాంటి వారిని గెలిపించకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఉపాధ్యాయులను కోరారు.ఏ రకంగా చూసిన కరీంనగర్ నియోజకవర్గంలో ఉద్యమ నేతైన వై.అశోక్ కుమార్ సమర్ధనీయుడని వారికే మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అశోక్ కుమార్ ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక నాయకుడని ఎల్లవేళలా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి పి. శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి. సాయి తేజ, జిల్లా కమిటీ సభ్యులు ఏ. వెంకయ్య, నాయకులు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking