అయోధ్య రామ మందిరం నిర్మాణం అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆలయ మందిరంలో కొలువుదిరిన శ్రీ రాముల వారి అక్షింతలు చేరవేసేందుకు మణికొండ మున్సిపాలిటీలోని 19వ వార్డులోని కెపిఆర్ కాలనీ మణికొండ గార్డెన్స్ లో శ్రీరాముల వారి భక్తులు, ఇంటింటికి తిరిగి రాముల వారి అక్షింతలను అందజేశారు, ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కె రామకృష్ణారెడ్డి గారు, కౌన్సిలర్స్ కావ్య శ్రీరాములు గారు, శైలజ గారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుదోళ్లు శ్రీరాములు గారు, కో ఆప్షన్ సభ్యులు సిద్ధప్ప గారు, మాజీ వార్డ్ మెంబర్ సభ్యురాలు కే శ్రీ ప్రియ రాజిరెడ్డి గారు,మాజీ AMC డైరెక్టర్ రాజి రెడ్డీ గారు నాయకులు ఏర్పుల కుమార్, శ్రీకాంత్, రామకృష్ణ రెడ్డీ, రవీందర్ రెడ్డీ, లక్ష్మి శ్రీ, విజయ లక్ష్మి, రాజేంద్రప్రసాద్, అందె లక్ష్మణ్, మరియు కాలనీవాసులు భక్తులు పాల్గొన్నారు.