ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో ఇరువురికి రూ.3 లక్షల విలువైన రెండు ఎల్వోసీ చెక్కులు అందజేత
ఖమ్మం ప్రతినిధి జనవరి 02 (ప్రజాబలం) బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత లభించింది. ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ వల్ల ఒక్కొక్కరికి రూ.1.50 చొప్పున ఇరువురికి రూ.3 లక్షల విలువైన రెండు ఎల్వోసీ చెక్కులు మంజూరయ్యాయి. ఖమ్మం కవిరాజ్ నగర్ కు చెందిన కోట మంగమ్మ కు రూ.1.50 వేలు, కారేపల్లి కి చెందిన కొనకండ్ల స్వాతికి మంజూరైన రూ.1.50 విలువైన ఎల్వోసీ చెక్కులను మంగళ వారం ఖమ్మం లోని ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు. మంగమ్మకు సంబంధించిన ఎల్వోసీ చెక్కును వారి కుమార్తె కావ్యశ్రీకి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాద్, దామ వీరయ్య, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, దిశ కమిటీ సభ్యురాలు చింతల చెర్వు లక్ష్మీ , నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.