అయోధ్య అక్షతలకు ఆకారపు గుడిలో పూజలు.

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 3:

అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని అక్షతలు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలను అందుకున్నాయి.
చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ స్టేషన్ రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆకారపు వారి గుడిలో అయోధ్య న అక్షతల వితరణ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు లంక శివకుమార్ శర్మ, రాపాక జగన్మోహన శర్మాలు ఆలయంలో అయోధ్య అక్షతలను పూజించి అనంతరం కృష్ణ కాలనీలోని ప్రజలకు వితరణ చేశారు. లోక కళ్యాణార్థం రామరాజ్య ప్రాప్తి కోసం అయోధ్య అక్షతలకు విశేష పూజలు నిర్వహించి భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకారపు హరి స్వాతి, స్థానిక కార్పొరేటర్ అనిల్ కుమార్, రామచంద్రారావు, వేణుగోపాల్ ముందాగా, బండారు ధవలేశ్వరరావు , తదితరులు వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking