అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పరిశీలించినమేడ్చల్–మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టర్ విజయందర్ రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
బుధవారం , మేడ్చల్ మండలం లోని ఎల్లంపేట్, డబిల్ పూర్ , గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ విజయందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, కేంద్రాలలో దరఖాస్తుల స్వీకరిస్తున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించి దరఖాస్తులను ఎలా నింపుతున్నారు అనే వివరాలు తెలుసుకున్నారు, అనంతరం అదనపు కలెక్టర్ విజయందర్ రెడ్డి, మాట్లాడుతూ ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తుకు అధికారులు తప్పనిసరిగా రసీదు అందించాలని, దరఖాసుదారులు ఏ ఏ పథకాలకు దరఖాస్తు చేశారనే వివరాలు రసీదు ఫారంలో టిక్కులు పెట్టాలని అదనపు కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గ్రామ సభ మొదలైనప్పటి నుండి జనవరి 6 వరకు ఉంటుందని తెలిపారు. కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరి వద్ద నుండి చివరి దరఖాస్తు తీసుకునే వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని అదనపు కలెక్టర్ విజయందర్ రెడ్డి, తెలిపారు.
ఈ కార్యక్రమాలలోవివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking