తూప్రాన్ మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం:…. హాజరైన ప్రజాప్రతినిధులు.
మెదక్ తూప్రాన్ జనవరి 3 ప్రాజబలం న్యూస్ :-
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుతో ప్రజల వద్దకే పాలన ప్రజాపాలన వేదిక గ్రామాలలో ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ వచ్చిన సంతోషమే కానీ పేద ప్రజల కు ఒరిగిందేమీ లేదు .గత పది సంవత్సరాలుగా ప్రజలు రేషన్ కార్డు లేక, పెన్షన్లు లేక ,ఇండ్లు లేక ,సిసి రోడ్లు, మోరీలు,
భూ సమస్యలు. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న వేళ ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు అమలు చేయగా అన్నింటిపై తొలి సంతకం చేసింది .ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాలలో ప్రజా పరిపాలన పేరుతో ఏర్పాటు చేసిన సభతో అధికార యంత్రాంగం పూర్తిగా గ్రామాల్లోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజలు తమ సమస్యలు ఇకనైనా పరిష్కారం అవుతాయని ప్రజా పాలనలో దరఖాస్తులు సమర్పించారు. ప్రజల వద్దకే పాలన వచ్చిన సందర్భంగా
తూప్రాన్ మున్సిపల్ పదో వార్డులో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు .ఈ కార్యక్రమంలో తూప్రాన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, రాజు రెడ్డి, మన్నె రాజు, మహేందర్ రెడ్డి,
పోచమ్మ మంజుల సత్యనారాయణ, యాదగిరి, రమేష్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.