బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే

 

అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు

ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ లో పూలే విగ్రహానికి పూల మాల వేసి, ఘనంగా నివాలర్పించిన నామ నాగేశ్వరరావు, పువ్వాడ, మధు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్‌ 11 (ప్రజాబలం) ఖమ్మం జ్యోతిరావు పూలే బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే జయంతిని పురష్కరించుకుని గురువారం ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్‌ లోని పూలే విగ్రహానికి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌,ఎమ్మెల్సీ తాతా మధు పూలమాల వేసి,ఘనంగా నివాళులర్పించి, ఆయన సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. బహుజనులు,వెనుబడిన వర్గాల వారి సమానత్వం కోసం , అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడని అన్నారు. ఈ సందర్బంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ పూలే మహిళా సాధికారత ఉద్యమాలకు ఆధ్యుడని , మహిళల అభ్యున్నతికి ఎనలేని సేవలందించారని అన్నారు. భారతీయ సమాజానికి ఆయన ఎనలేని సేవలు అందించిన గొప్ప సంఘ సంస్కకర్త అని కొనియాడారు. కుల,అంటరానితనం నిర్మూళనకు కృషి చేసిన మహనీయుడని అన్నారు. అట్టడుగు వర్గాలు, కులాలు, నిరక్షరాస్యత, మహిళలపై సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగాను, వారి హక్కుల కోసం పోరాడారని అన్నారు. కుల వ్యతిరేక ఉద్యమం నడిపి, మహిళ విద్యను మరింత ముందుకు తీసుకుపో యేందుకు పూలే చేసిన కృషికి విస్తృత గుర్తింపు లభించిందన్నారు. తన సతీమణి సావిత్రీబాయి పూలేని చదివించడంతో పాటు ఆమెనే ఉపాధ్యాయురాలిగా చేసి, పాఠశాలను స్ధాపించి,విద్యను మహిళలకు అందించారని అన్నారు. అట్టడుగు వర్గాల వారి కోసం ప్రత్యేకించి పాఠశాలలు స్ధాపించి,వారి ఉన్నతికి అవిశ్రాంతంగా శ్రమించారని అన్నారు.సామాజిక సంస్కరణలపై , స్త్రీ విముక్తి కోసం ఆయన రాసిన రచనలు , వ్యాసాలు ఎంతో ఉత్తేజపర్చాయని అన్నారు. అణిచివేత లేని సమ సమాజం కోసం పూలే నిరంతరం పోరాడిన గొప్ప సామాజిక వేత్త అని అన్నారు.సామాజిక ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ పార్టీ జిల్లా నాయకులు తాళ్లూరి జీవన్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్‌ వలరాజు, పార్టీ జిల్లా నాయకులు ఆర్జేసీ క్రిష్ణ బచ్చు విజయకుమార్‌ చిత్తారు సింహాద్రి యాదవ్‌, గోడ్డేటి మాధవరావు వాకదాని కోటేశ్వరరావు, మోరంపూడి ప్రసాద్‌ నామ సేవా సమితి నుంచి పాల్వంచ రాజేశ్‌ కృష్ణప్రసాద్‌ సరిపూడి గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking