ప్రజలందరిపై అల్లా దయ ఉండాలి

 

నగరంలో ముస్లిం సోదరులతో మమేకమైన నామ పువ్వాడ మధు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 (ప్రజాబలం) ఖమ్మం ప్రజలందరిపై అల్లా చల్లని కృప, దయ, దీవెనలు కలకాలం ఉండాలని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు గారు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా వారు గురువారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించి, ముస్లిం ల సామూహిక ప్రార్ధనల్లో పాల్గొని, వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి, వారి సంతోషంలో బాగస్వాముల య్యారు.ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో నూతన వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. నూతన ఆశలను నెరవేర్చుకునేందుకు ముందుకు వెళ్లాలని నామ అన్నారు. బోనకల్లు రోడ్డులోని ముస్తఫానగర్ లో మక్బుల్, సఖీనా గారి ఇంటితో పాటు ఖిల్లా లో ఉస్మాన్, అజాం, సౌకత్ ఆలీ, అసద్, ఖమర్, ఇత్హార్, బాబీ ( జార), గట్టయ్య సెంటర్ లో అబ్బాస్ గృహాలకు వెళ్లి, పండుగ సంబరాల్లో వారితో కలిసి మమేకమై వారి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి, వారిచ్చిన ఆతిద్యాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ తాతా మధు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, పార్టీ జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ, సూడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, తాళ్లూరి జీవన్, ముస్లిం మైనారిటీ నాయకులు తాజుద్దీన్, ఫిరోజ్, బాబీ, సౌకత్ అలీ, అబ్బాస్ తో పాటు నామ సేవా సమితి నుంచి రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, సరిపూడి గోపి, తదితరులు పాల్గొన్నారు కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతోను రైతులు మంచి వర్షాలతో పుష్కలంగా పంటలు పండించి, ఆనందంగా జీవించి, చల్లగా వర్ధిల్లాలని నామ గారు దైవాన్ని కోరుకున్నారు. వేలాదిగా సామూహిక ప్రార్ధనల్లో పాల్గొన్న ముస్లిం లు, ముస్లిం పెద్దలు నామ నాగేశ్వరరావు గారిని ప్రేమతో ఆప్యాoగా పలకరించి, ఆలింగనం చేసుకొని, మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మేయర్ నీరజ, కార్పొరేటర్ వలరాజు ముస్లిం మైనారిటీ సంఘం అధ్యక్షులు తాజుద్దీన్ బాబీ, ముస్లిం మైనారిటీ నాయకులు ఫిరోజ్ తో పాటు పార్టీ నాయకులు తాళ్లూరి జీవన్ తన్నీరు రవి సింహాద్రి యాదవ్ మోరం పూడి ప్రసాద్ నామ సేవా సమితి నుంచి రాజేష్,సరిపూడి గోపి చీకటి రాంబాబు కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking