పేద విద్యార్థినిని అభినందించిన బంధు సొసైటీ నాయకులు

 

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/ కొండాపూర్ మండలం చెర్లగొపులారం గ్రామానికి చెందిన స్వర్గీయ దొబ్బల రాజు వినోద దంపతుల పెద్దకుమార్తె దొబ్బల రూప డాక్టర్ అఫ్ ఫార్మసీ ఉత్తమ గ్రేడ్ తో ఉత్తీర్ణత సాధించిన సందర్బంగా బంధు సొసైటీ సంగారెడ్డి జిల్లా కమిటీ నాయకులువిద్యార్థిని ఆమె నివాసంలో శాలువాతో సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా మారుతీ బంధు సొసైటీ నాయకుడు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టాలను లెక్కచేయకుండా పట్టుదలతో చదివి డాక్టర్ అఫ్ ఫార్మసీ పూర్తి చేయడం సంతోషం అన్నారు.వచ్చిన మూలాలను మరువకుండా పెదలకు సేవ చేయాలని సూచించారు. ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చవాన్ సుభాన్ సింగ్ మాట్లాడుతూ పేద విద్యార్థులు రూపను ఆదర్శంగా తీసుకొని చదవాలన్నారు.లక్ష్యం ఏర్పాటు చేసుకుని కష్ట పడి చదివితే సాధించలేనిది ఏది ఉండదని, సమస్యలు తాత్కాలికం అని వాటిని లెక్కచేయకుండా ముందుకు వెళితే విజయం వరిస్తుందని డానికి నిదర్శనం రూప అని ఎస్సి, ఎస్టీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుర్రి చంద్రశేఖర్ అన్నారు. తమ కూతురును సన్మానం చేయడం పట్ల తల్లి వినోద సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దాపురం దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking