ఈ నెల 22న తూప్రాన్ లో ఉచిత వైద్య శిబిరం

రీఎక్స్ పర్ట్ మరియు మెడ్ వన్ సూపర్ స్పెషాలిటీ నిష్ణాతులైన వైద్యులచే

తూప్రాన్, ఫిబ్రవరి,21. ప్రాజబలం ప్రతినిధి.

తూప్రాన్ పట్టణంలోని శ్రీనివాస్ నర్సింగ్ హోం ఎదురుగా హెచ్.పి పెట్రోల్ పంపు వద్ద ఫిబ్రవరి 22 శనివారం ఉదయం రీఎక్స్ పర్ట్, మెడ్ వన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు చెందిన నిష్ణాతులైన వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్యాంప్ మేనేజర్ డాక్టర్ ఆనంద్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ప్రస్తుతం తూప్రాన్ లో అందరికి అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్య సేవలు అందించే సదుద్దేశంతో తూప్రాన్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇట్టి సదవకాశం ను తూప్రాన్ పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking