ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..కొమురం భీమ్ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్మల్ కు విచ్చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్.బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వెయ్యి ఉరిల మర్రి వద్ద అమరవీరుల స్థూపం వద్ద నాయకులు నివాళులర్పించారు.ఈ సంధర్బంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే వెయ్యి ఉరిల మర్రి చెట్టు ఉందో అక్కడే రాంజీ గోండు స్మారక అమరవీరుల స్థూపం ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ మేరకు నిర్మాణ స్థలంలో బండి సంజయ్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు