ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 21 (ప్రజాబలం) ఖమ్మం ప్రజారక్షణలో పోలీసుల పాత్ర చాల కీలకమైనద ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. స్టైఫండరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల తొమ్మిది నెలల పోలీస్ శిక్షణలో భాగంగా బుధవారం రామగుండం వికారాబాద్ నారయణపేట్ జిల్లాల నుండి ఖమ్మం సిటీ పోలీస్ శిక్షణ కేంద్రానికి చేరుకున్న193 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..పోలీసు యూనిఫాం సమాజంపై జవాబుదారీతనం పెంచుతుందన్నారు. శిక్షణ ఆనంతరం రోజువారీ సవాళ్లను ఎదుర్కొంటూ నిరంతరం క్షేత్రస్థాయిలో విధినిర్వహణ చేయాల్సి భాద్యత ఉంటుందన్నారుఉన్నత చదువులు చదువుకున్న మీరందరూ సమాజం పట్ల విశ్వసనీయత పెంపొందించేలా ప్రజాసేవకు అంకితం కావలని అన్నారు. నేరాల నియంత్రణ ,టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులకు మంచి గుర్తింపు వుందని అన్నారు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాల ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్క ట్రైనీ కానిస్టేబుల్ గుర్తుంచుకోవాలన్నారు శిక్షణ కాలంలో ఇండోర్, అవుట్ డోర్ అన్ని అంశాలను క్రమపద్ధతిలో నేర్చుకొని తొమ్మిది నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం వున్న పోలీస్ శాఖలో చేరిన సక్రమంగా సద్వినియోగం చేసుకొవాలని అన్నారు.
ప్రజల ఆత్మగౌరవం భగం కలగకుండా సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలతో మంచి నడవడిక అలవాటు చేసుకోవాలన్నారు ఈ శిక్షణ కేంద్రంలో అన్ని రకాల మౌలిక వసతులతో పాటు, నైపుణ్యత కలిగిన ఫాకల్టీ మంచి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ గణేష్ ఎస్ బి ఏసీపీ ప్రసన్న కుమార్ ఏవో అక్తరూనీసాబేగం, ఆర్ ఐ లు తిరుపతి, కామరాజు, శ్రీశైలం, అప్పలనాయుడు, సిఐలు అంజలి, వెంకన్న, ఉదయకుమర్ పాల్గొన్నారు.
