వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 21:
కాంగ్రెస్ పార్టీ 26వ డివిజన మహిళా ఉపాధ్యక్షురాలుగా కర్రే రమాదేవి నియమితులయ్యారు.
ఈ మేరకి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న గౌడ్ ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా 26వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షురాలు రమాదేవ మాట్లాడుతూ కొండా దంపతుల ఆశీర్వాదం తో నన్ను ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ నీ బలోపేతం చేసే విధంగా ప్రజల్లోకి పార్టీ సంక్షేమ పథకాలను బలంగా తీసుకెళ్తానని తద్వారా కాంగ్రెస్ పార్టీ
పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తన పదవి కి సహకరించిన
నారగోని మురళి ,నల్గొండ రమేష్ ,మడిపెల్లి కృష్ణ ,డివిజన్ అధ్యక్షులు జన్ను భాస్కర్ ,ఓరుగంటి మల్లికార్జున్,వీరన్నలకు ఆమె ధన్యవాదాలు తెలియజేసారు.