ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 6:
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చే పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన పై సదుపాయాలను క్షేత్రస్థాయి లో పనులను పరిశీలించి ఫైనల్ ఎస్టిమేషన్ నివేదికలు త్వరగా సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం రోజున వీసీ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య , ఇ ఇ, పి ఆర్, ఈ ఈ ఆర్ అండ్ బి, ఎం ఏ యు డి, ఆర్ డబ్ల్యు స్ ,ఈ డబ్ల్యూ ఐ డి సీ అధికారుల తో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మౌలిక వసతులు అవసరమైన పాఠశాలలను సందర్శించి నిర్వహించాల్సిన పనుల ఫైనల్ ఎస్టిమేషన్ ను రూపొందించి వెంటనే పంపాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, తరగతి గదుల మేజర్, మైనర్ మరమ్మతులు, టాయిలెట్ మరమ్మతులు, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణ పనులు, విద్యుత్ సౌకర్యం, పెయింటింగ్ వంటి మౌలిక వసతుల పర్యవేక్షణ పనుల వ్యయ అంచనాలను త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేసి పక్కాగా ప్రతిపాదన రూపొందించాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల పనులు అమ్మ ఆదర్శ కమిటీ ద్వారానే పూర్తి చేయాలన్నారు. పాఠశాల మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఏ పాఠశాలలో ఏఏ పనులు చేపట్టాలో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనుల గురించి కార్యాచరణ రూపొందించుకోవాల్సిందిగా కోరారు. జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి అవసరమైన ప్రతిపాదనలు త్వరగా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులలను కొన్నింటిని గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన పాఠశాలలను కూడా గుర్తించి త్వరగా నివేదిక సమర్పించాలన్నారు. మౌలిక వసతులకల్పనతో పాఠశాలల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ్ కుమారి, డిఆర్ డిఎ పిడి సాంబశివరరావు, మెప్మా అధికారి అనిల్ ,ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాస్ , ఈ డబ్ల్యూ ఐడిసీ, పంచాయతీ రాజ్ , ఏ ఎం ఓ రవీంద్ర రాజ్, టి ఎస్ ఈ డబ్ల్యూ ఓ డి సి, డిప్యూటీ ఈఈ బుగ్గయ్య , ఈఈ దుర్గ ప్రసాద్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.