మణికొండలో బతుకమ్మ సంబరాలు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 11 అక్టోబరు 2024:
మణికొండ కౌన్సిలర్లు ఆలస్యం నవీన్ కుమార్, పద్మారావు, శ్రీకాంత్ స్వామిల ఆద్వర్యంలో 10 అక్టోబరు గురువారం రోజున కని విని ఎరుగని రీతిలో అలకాపురి టవున్ షిప్ మహిళలు అసంఖ్యాకంగా మహాత్మాగాంధీ పార్కలో సద్దుల బతుకమ్మ పండుగలో పాల్గొని ఆట పాటలతో సందడి చేసి విచ్చేసిన అతిథులను ఆనంద భరితులను గావించి కార్యక్రమాన్ని జయప్రదం గావించినారని ఇట్టి సందర్భములో వీ.ఆర్.4 సహాయోగ్ చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు బతుకమ్మ సంబురా లను అగ్ర పూజ గావించి మొదలు పెట్టగా రాజేంద్రనగర్ శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్, కౌన్సిలర్లు వందనా నగేష్, శైలజా గోపాల్, శ్వేతా రవికాంత్ రెడ్డి లతో పాటూ స్థానిక మహిళలతో పాల్గొని బతుకమ్మ ఆడినారని, కార్య క్రమంలో కౌన్సిలర్ రామకృష్ణ రెడ్డి, మాజి మార్కెట్ కమిటీ సభ్యుడు బుద్దోల్ శ్రీరాములు, ఆకుల నరేష్, నవీన్ గురుకుల, రితీష్, స్థానిక నాయకులు మాల్యాద్రి నాయుడు, బషీర్, శ్రవణ్, లక్ష్మీశ్రీ, జయరాజ్, అరిఫ్, భాను, కాలనీ అసోసియేషన్ పెద్దలు, సభ్యులు తది తరులు పాల్గొని విజయవంతం గావించినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking