హైదరాబాద్ ఆగస్టు 16 (); హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోనల్ ఆఫీస్ లో జోనల్ మేనేజర్ శుభకర్ తో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారులకి విశాఖ జోనల్ పరిధి లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముద్ర కిషోర్ యోజన ద్వారా క్లస్టర్ టు గోల్డ్ స్మిత్ ఏర్పాటుచేసి ఐదు లక్షల వరకు మరియు నెలవారి వాయిదాల 60 నెలలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ నుండి బదిలీ హైదరాబాదు వచ్చిన సందర్భంగా వేణుమాధవ్ కలిసి విశాఖ జోన్లో తొంబై ఆరున్నర శాతం నెలవారి వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నామని మిగతా మూడున్నర శాతం కూడా స్థానిక సంఘాల ద్వారా వసూలు చేయించి కట్టించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా స్వర్ణకార కుటుంబాల అభివృద్ధిలోకి రావడానికి త్వరలో జరగనున్న అఖిల భారతీయ స్వర్ణకార సంఘ సమావేశంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచ్చిన అవకాశాన్ని దేశవ్యాప్తంగా తెలియజేస్తామని కర్రి వేణుమాధవ్ తెలిపారు ఈ సమావేశంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు