ఆర్. కృష్ణయ్య అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

తీవ్రంగా ఖండించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపా అధ్యక్షులు గుజ్జ సత్యం
హైదరాబాద్ ఆగష్టు 16 ();పార్లమెంటు సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అక్రమ అరెస్ట్ ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపా అధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు. సమగ్ర శిక్ష తదితర ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడికి మద్దతు పలికిన ఆర్. కృష్ణయ్య తో పాటు నీకమంది బిసి నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కెసిఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబంధించాలని, సుప్రీంకోర్టు ఆదేశాలైన సమాన పనికి సమాన వేతనం తీర్పును అమలు చేయాలని తదనుగుణ న్యాయమైన డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్త 27వేల మంది ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా విద్యాశాఖ కమిషనరేట్ వద్ద ధర్నా చేస్తుంటే ఆ డిమాండ్లపై కనీస చర్చకు కూడా సంబంధిత గణం ఆహ్వానించకుండా ప్రభుత్వ అధినేత ఆదేశాలకు అనుగుణంగా అరెస్టులు చేయడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని రికార్డ్ స్థాయిలో ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్న బీసీ సంక్షేమ సంఘానికి, ఆర్.కృష్ణయ్యకు ఇటువంటి నిర్బంధ సత్కారం ఈ ప్రభుత్వ ఘనత అని ఆయన హేళన చేశారు. ప్రోటోకాల్ నిబంధనలు మరిచి రాజ్యసభ చైర్మన్ అనుమతి లేకుండా అరెస్టు చేయడానికి సవాల్ చేస్తామని ఆయన తెలిపారు. రాజకీయేతర, నిఖార్సైన ప్రజా సంఘాలపై ప్రభుత్వ వైఖరి ఈ చర్యతో తేట తెల్లమైందని ఆయన తెలిపారు. ఆంధ్ర పాలకుల హయాంలో నక్సరెట్లు, మావోయిస్టులపై ఇటువంటి నిర్బంధము ఉండేదని ఆయన గుర్తు చేశారు. స్వపరిపాలనలో ప్రజా సంఘాలను ప్రలోభాలతో చీల్చే అలవాటుగా మార్చుకున్న కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంతోనే నిరాశ నిస్పృహలతో ఇటువంటి చర్యలకు పూనుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోటోకాల్ నిబందనల ఉల్లంఘన, ప్రభుత్వాలకు రాజ్యాంగం నిర్దేశించిన నిబంధనలు నిరవధికంగా ఉల్లంఘిస్తున్న నేపధ్యంలో తగు చర్యలకై కేంద్రాన్నిగుజ్జ సత్యం డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking