పెన్షన్ ఇవ్వడం మరువం
__ రాష్ట్ర బీడీ కార్మిక సంఘం గౌరవ అద్యక్షులు రూప్ సింగ్
_
జగిత్యాల, ఆగస్టు 16: బీడీ కార్మికుల తోనే పెన్షన్ వ్యవస్థ ఆగిపోతుందని టెకెదార్లు అందరూ అనుకొన్నారని వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ టెకెదార్లకు పెన్షన్ ఇవ్వడం హర్షించదగిందని బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర బీడీ కార్మిక సంఘం గౌరవ అద్యక్షులు రూప్ సింగ్ అన్నారు. బుధవారం జగిత్యాల లోని మోతె రొడ్ఫులోని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో టేకేదార్ల తో నిర్వహించిన సమావేశంలో రూప్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూప్ సింగ్ మాట్లాడుతూ మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని బీడీ కార్మికుల శ్రమను గుర్తించి పెన్షన్ ఇచ్ఛాడన్నారు. బీడీ కార్మికుల కంటే ఎక్కువగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న టేకేదార్ల సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్ పెన్షన్ అమలు చేయడం గొప్ప మానవతావాది గా నిలిచిపోతాడన్నారు. టేకేదార్ల పెన్షన్ అమలు చేయడంలో కృషిచేసిన ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు మంచే నర్సింహులు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకేదార్ల సంఘం నాయకులు తీగెల వెంకన్న, క్యాస మల్లా రెడ్డి, అరె రవీందర్, ఎన్గుందుల నారాయణ, బొమ్మకంటి ధర్మపురి, గాజుల లక్ష్మీపతి, సట్ట రవీందర్ తోపాటు పలువురు ఉన్నారు.