డాక్టర్ వేణు గోపాల కృష్ణ కి ఉత్తమ పురస్కారం

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ ఎం ఓ. డాక్టర్ వేణు గోపాల కృష్ణ అందిస్తున్న ఉన్నత సేవలకి తెలంగాణా ప్రభుత్వం 77 వ స్వాతంత్ర దినోత్సవ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ప్రైవేట్ ప్రాక్టీస్ లేకుండా ఎల్లపుడు ప్రభుత్వ ఆసుపత్రి లో సేవలoదిస్తూ ప్రజలు.. అధికారులు.. ప్రజా ప్రతినిధులు.. మన్నన లందుకున్నారు. వైద్య రంగం లోనే కాకుండా సాహిత్యం.. కళ రంగం ఇప్పుడు చిత్ర రంగం లో కూడా సేవలoదిస్తున్నారు. సమాజ సేవ లో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఎందరికో ఆదర్శం గా నిలుస్తున్నారు డాక్టర్ వేణు గోపాల కృష్ణ. ఉత్తమ సమాజ సేవ పురస్కారం పొందారు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తో పాటు నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి.. జడ్పీ.ఛైర్ పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్ రెడ్డి.జిల్లా జడ్జి కర్ణ కుమార్.ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎంపీపీ రమేశ్వర్ రెడ్డి తదితరుల సమక్షంలో. డాక్టర్ వేణు గోపాల కృష్ణ ని అధికారులు ప్రజా ప్రతి నిధులు ప్రజలు అభిందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking