ఆర్ కృష్ణయ్య అక్రమ అరెస్ట్ ను ఖండించిన బీసీ మహిళా ఐక్యవేదిక

హైదరాబాద్ ఆగష్టు 16;బిసి ఉద్యమ జాతీయ నేత ఉద్యమ సూర్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యను ప్రభుత్వ ప్రోటోకాల్ నిబందనలు ఉల్లంగించి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఏ.పుష్పలత, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కే. లక్ష్మి లు తీవ్రంగా ఖండించారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 26వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేయాలని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం లో శాంతియుతంగా దార్నా చేస్తున్నవారికి మద్దతు పలికిన కృష్ణయ్య ను ప్రభుత్వ ప్రోటోకాల్ నిబందనలు ఉల్లంగించి అక్రమంగాఅరస్ట్ చేసారని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించడం నేరమా అని వారు ప్రశ్నించారు.పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటం దారుణం అమానుశం అప్రజాస్వామికమన్నారు.పోలీసుల అక్రమం అరెస్ట్ ను బీసీ ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఏ.పుష్పలత, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కే. లక్ష్మి లు తీవ్రంగా ఖందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking