కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశం కల్పించాలి – వి నర్సింగ్ రావు 

దేశంలో అత్యధిక జనాభా కలిగిన యువతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంలో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ప్రజా ఏక్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వి నర్సింగ్ రావు ఆరోపించారు ఈ మేరకు బుధవారం దేశ్ కి బాత్ ఫౌండేషన్ అధ్యక్షుడు హైమద్ హాసన్ అబ్బాస్, స్టేట్ కో అర్డినేటర్ వంకర్ సాయి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో ఎంప్లాయిమెంట్ పార్లమెంట్ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన సుబ్రిం ముస్తాక్, ఢిల్లీకి చెందిన రాజేందర్ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు టి రాకేష్ సత్యం శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking