బిసి బిల్లు పై అన్నీ రాజకీయ పార్టీల బీసీ నాయకులు కలిసి రావాలి

 

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు

హైదరాబాద్ ఏప్రిల్ 13 బిసి బిల్లు పై అన్నీ రాజకీయ పార్టీల బీసీ నాయకులు కలిసి రావాలని – జాతీయ బీసీ సంక్షేమ సంఘం                                                               అధ్యక్షులు     రాజ్యసభ సబ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు. గురువారం బిసి భవన్ లో మీడియా తో మాట్లాడుతూ పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఏటా 2లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని అలాగే కేంద్ర స్థాయిలో కాలేజీ విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు స్కాలర్ షిప్ స్కీము ప్రవేశపెట్టాలని, ఫీజుల రియంబర్స్మెంట్ స్కీం పెట్టాలని, హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని, కులవృత్తిలు కోల్పోయిన వారికి ప్రతి కుటుంబానికి 20 లక్షలు సబ్సిడీ రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని, తదితర 16 డిమాండ్లతో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీష్ దనకర్, హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, CPI నేత  ఏచూరి సీతారాం, సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్, BSP, DMK, అన్నా DMK, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాధల్, బీజా జనతాధల్ సిపిఐ తదితర పార్టీల నేతలను 96 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. గత నెల రోజులు బీసీ సంక్షేమ సంఘం నేతలు – పార్లమెంట్ వద్ద భారీ ధర్నాలు – ప్రధర్శనలు జరిపి – అన్నీ పార్టీల నాయకులను కలిసి చర్చించడం జరిగింది. అన్నీ రాజకీయ పార్టీలలో యున్న బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయడానికి కలిసి రావాలని పిలుపు నిచ్చారు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలు గత 75 సంవత్సరాలుగా బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వకుండ అన్యాయం చేస్తున్నారు. విద్యా,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదు ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలి కానీ 75 సంవత్సరాలు గడిచిన వాటా ఇవ్వడం లేదు. బి.సి లంటే ఉత్పత్తి కులాలు. దేశ సంపద సృష్టిస్తున్నారు. కాని సంపద అనుభవించే హక్కు లేదు. అవకాశం లేదు. పన్నులు కట్టే దేశ బడ్జెట్ ఇస్తున్నారు. కాని బడ్జెట్ లో కనీస వాటా లేదు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు. కాని అధికారంలో బి.సి లకు వాటా ఇవ్వడం లేదు. ఈ దేశం లో బి.సిలకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు.ఇది ప్రజస్వామ్యదేశం అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. అప్పుడు దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుంది. అందుకోసం బి.సి లకు రావలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరుగాలి. బి.సి లకు రాజ్యాంగబద్దమైన హక్కులు-వాటా కల్పించవలసిన సమయం ఆసన్నమైనది. 75  సంవత్సరాల  ప్రజాస్వామ్య భారత వ్యవస్థలో 56 శాతం జనాభా గల బి.సి లకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో 5 శాతం, ఉన్నత న్యాయ స్థానాలలో 2 శాతం ప్రాతినిథ్యం లేదంటే బి.సి లకు జనాభా ప్రకారం అన్నీ రంగాలలో వాటా ఇవ్వవలిసిన  ఆవశ్యకతను తెలుపుతుంది. 56 శాతం జనాభా గల బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం యుంటే ఇదేమి ప్రజా స్వామ్యం అని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు. ఇది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య హక్కు స్వాతంత్రం వచ్చినప్పుడు బీసీలకు అసెంబ్లీ – పార్లమ్మెటుల్లో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ కులాలను అందిచేస్తున్నారని విమర్శించారు. 2021-22 లో సేకరించి బోయే జనాభా గణనలో కులాల వారిగా బీసీ జనాభా గణన చేయాలని సమావేశం కోరింది. ఎస్సీ/ఎస్టీల జనాభా ను కులాల వారిగా సేకరిస్తున్నారు. బీసీల జనాభా సేకరించడానికి అభ్యంతరాలు ఏమిటి? చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవు. పులులు తదితర జంతువుల లెక్కలు ఉన్నాయి. కానీ బిసి జనాభా లెక్కలు చేయాలంటే అనేక అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు. సుప్రీం కోడ్డు- హై కోర్టు బి.సి. జనాభా లెక్కలు సేకరించాలని 40 సం.రాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం బి.సి జనాభా లెక్కలు తీయకుండా బికించి అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking