బి.సి.ఎన్ చానెల్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారులు డి పి ఆర్ ఓ ఏడుకొండలు.
మెదక్ జనవరి, 30 ప్రజా బలం న్యూస్:-
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిక్షణం పేదల పక్షాన ఉండే ఛానల్ బి.సి.ఎన్ చానెల్ రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉదయం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు,
డి పి ఆర్ ఓ ఏడుకొండలు రిపోర్టర్ గడ్డం ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను అవిష్కరించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బి.సి.ఎన్ ఛానల్ యజమానానికి రిపోర్టర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల కోసం, ప్రజల సేవ కోసం, ప్రజా సమస్యలను ప్రభుత్వ పెద్దల అధికారుల దృష్టికి, తీసుకువచ్చి ప్రజలను చైతన్యవంతులను చేయాలని మంచి ప్రసారాలను అందజేయాలని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
బాలాజీ కార్పొరేషన్ నెట్ వర్క్ బి.సి.ఎన్ 24×7 న్యూస్ చానెల్ అధినేత మిద్దెల జితేందర్ సారథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి ప్రసారమైతున్న ప్రతిక్షణం పేదల పక్షంగా ఉండే ఛానల్, ప్రజలకు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ పెద్దలకు సమస్యలపై సమాచారాన్ని ఇస్తున్న బి.సి.ఎన్ చానెల్ కు ఆదరణ పెరిగిందని వక్తలు అన్నారు. శాటిలైట్ చానెల్ కు తీసిపోని విధంగా ప్రసారాలు అందిస్తున్న తెలుగు ఛానల్ అని అన్నారు. బి.సి.ఎన్ చానెల్ నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా రౌండ్ ద క్లాక్ న్యూస్ అందిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్ లో గడ్డం ప్రశాంత్ కుమార్ సేకరించిన యాడ్స్ తో క్యాలెండర్ తో విస్తృతంగా ప్రచారం జరిగిందని అన్నారు. దీనితో బి.సి.ఎన్ రేటింగ్ తోపాటు వ్యువర్ షిప్ విపరీతంగా పెరిగిపోయింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో
జర్నలిస్టులు నేరెళ్ల శ్రీరామ్ , శివ, రామ్, రాణి, రాజు, జయరాజ్ ,సిద్దు, యాదగిరి , ఆంజనేయులు ,ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
