గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడంలో ఆర్.ఎం.పి, పి.ఎం.పిల పాత్ర ముఖ్యమైనది : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం .

ఆర్ఎంపీ,పీఎంపీలకు విధివిధానాలు  ప్రకటించి గ్రామాల్లో వైద్యం చేసేందుకు గుర్తింపు సర్టిఫికెట్ జారీ చేయాలన్న విషయాన్ని  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ  నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నూతన సంత్సరం డైరీ , క్యాలెండర్ ను కోదండరాం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడంలో ఆర్.ఎం.పి, పి.ఎం.పిల పాత్ర ముఖ్యమైనదన్నారు. గత ప్రభుత్వ హాయంలో వీరిసేవలను పట్టించుకోక పోవడం విచారకరమన్నారు.గతంలో చాలామందికి పరీక్షలు నిర్వహించి కూడా సర్టిఫికెట్లు ప్రధానం చేయలేదన్నారు.తమకు విధించిన  నియమాల ప్రకారమే  వైద్యాన్ని అందిస్తామని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పులగ మోహన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నూతన ప్రభుత్వం తమను గుర్తించి వైద్య సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వృత్తి పై ఎంతో మంది జీవనోపాధి  పొందుతూ… అనేక గ్రామాలలో ప్రజల ప్రాణాలనుకాపాడుతున్నామన్నారు.అలాంటి తమపై  వివిధ నిబంధనల పేరుతో అణిచివేతకుగురిచేస్తున్నారన్నారు.వాటి నుండి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking